BRS | తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఆర్టీవీపై బీఆర్ఎస్ చర్యలకు ఉపక్రమించింది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అని ఫేక్ వార్తలు ప్రచారం చేసిన ఆర్టీవీ, రవి ప్రకాశ్‌కు లీగల్ నోటీసులు పంపించింది.
గత పదేళ్ల నుంచి బీజేపీతో బీఆర్ఎస్ విబేధిస్తుందని ఆ లీగల్ నోటీసులో గుర్తుచేసింది. కానీ ఆర్టీవీలో ప్రచారం చేసిన అసత్య ప్రచారం వల్ల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రభావితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రచారంతో బీఆర్ఎస్ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని తెలిపింది. బీఆర్ఎస్ పార్టీపై ఆర్టీవీలో ప్రసారంచేసిన అసత్య ప్రచారాలకు సంబంధించిన యూట్యూబ్ లింకులను ఆ నోటీసులో పేర్కొన్నది.
సదరు లింక్‌లను తక్షణమే తొలగించాలని ఆర్టీవీని ఆ నోటీసుల్లో డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీపై అసత్య ప్రచారాలను ఇప్పటికైనా మానుకోవాలని సూచించింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.