BRS Party | హైదరాబాద్ : 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీ ఫాంపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు.. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పోరాటం చేస్తోంది. ఈ అంశంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా, ఆయన సమయం ఇవ్వడం లేదు. ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించారు.
అయితే పార్టీ ఫిరాయింపులపై భారతీయ జనతా పార్టీ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. చంపినోడే సంతాపం తెలిపినట్టుంది బీజేపీ వ్యవహారం అని మండిపడింది. ఫిరాయింపుల ద్వారా, అధికార ప్రలోభాల ద్వారా బరితెగించి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన పార్టీ బీజేపీ.. పొద్దున లేస్తే ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేసే పార్టీ బీజేపీ అని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది. ఈ దేశంలో గత పదేండ్లలో.. ప్రజల చేత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన 10 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన నీచ చరిత్ర బీజేపీ పార్టీది అని బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేసింది. అయినా.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని విమర్శించింది బీఆర్ఎస్ పార్టీ.
ఉత్తరాఖండ్ (2016)
మణిపూర్ (2017)
గోవా (2017)
మేఘాలయ (2018)
జమ్మూ & కాశ్మీర్ (2018)
అరుణాచల్ ప్రదేశ్ (2019)
కర్ణాటక (2019)
మధ్యప్రదేశ్ (2020)
పుదుచ్చేరి (2021)
మహారాష్ట్ర (2022)
చంపినోడే సంతాపం తెలిపినట్టుంది బీజేపీ వ్యవహారం.
ఫిరాయింపుల ద్వారా, అధికార ప్రలోభాల ద్వారా బరితెగించి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన పార్టీ బీజేపీ.. పొద్దున లేస్తే ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేసే పార్టీ బీజేపీ.
ఈ దేశంలో గత పదేళ్లలో.. ప్రజల చేత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన 10 రాష్ట్ర… https://t.co/cQNYDU6qxl
— BRS Party (@BRSparty) June 27, 2024