BRS MP KK | భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించిన కేంద్ర సర్కారుకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ కే కేశవరావు (KK) కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బిడ్డకు భారతరత్న అవార్డు దక్కడాన్ని దేశ ప్రజలందరూ హర్షిస్తున్నారని ఆయన అన్నారు.
పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని తాము చాలా కాలంగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని కేకే చెప్పారు. గతంలో పలుసార్లు బయట, చట్టసభల్లో తమ డిమాండ్‌ను వినిపించామని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో తాము పీవీ శతజయంతి ఉత్సవాలు కూడా నిర్వహించామని కేకే గుర్తుచేశారు.