దక్షిణాఫ్రికా : దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy)పై దాడిని బీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ(NRI) ఖండించింది. ఈ సందర్భంగాబీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరమన్నారు. స్వేచ్ఛాయుతా వాతావరణంలో ఎన్నికలు జరుగాలన్నారు. దాడి ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా సరైన పద్ధతి కాదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణను ఆగం కానివొద్దన్నారు. హింసా రాజకీయాలకు పాల్పడే పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని సూచించారు.