హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్న ప్రపంచ అందాల పోటీలకు అంతర్జాతీయ మీడియా కవరేజీ లేనేలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. మంగళవారం ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. ఈ పోటీలను రియల్ ఎస్టేట్ ఎక్స్పోగా సీఎం రేవంత్‌రెడ్డి మార్చారని దుయ్యబట్టారు.
అంతర్జాతీయ నైపుణ్యాలు ఆశించినప్పటికీ.. చివరకు వారికి మిగిలింది మల్టి ఫ్లెక్స్‌లు, హానర్స్ హోమ్స్, హైదరాబాద్ ప్లాట్లు అని ఆరోపించారు. ఇది నిజంగా అద్భుతమే అని ఆయన ఎద్దేవా చేశారు.