BRS | సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు.. మేడిగడ్డకు బీఆర్ఎస్
గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నా రైతులకు సాగునీటిని అందివ్వటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు, సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ మేడిగడ్డ బాట పట్టనున్నది.
- నేడు, రేపు ప్రాజెక్టుల పరిశీలన
- తరలివెళ్లనున్న ప్రజాప్రతినిధులు
BRS | హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నా రైతులకు సాగునీటిని అందివ్వటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు, సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ మేడిగడ్డ బాట పట్టనున్నది. గురు, శుక్రవారాల్లో కన్నెపల్లి పంప్‌హౌస్, మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించనున్నది. గురువారం శాసనసభలో బడ్జెట్ ప్రసంగం ముగిశాక అక్కడి నుంచే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డకు బయలుదేరనున్నది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం జరిగిన పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముందుగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం కరీంనగర్‌లోని ఎల్ఎండీ (లోయర్ మానేర్డ్యామ్)ని పరిశీలించి రాత్రి రామగుండంలో బస చేసి శుక్రవారం జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంపుహౌస్‌ను సందర్శిస్తుంది. అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్లి బరాజ్‌ను పరిశీలించి తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల శ్రేణులు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందానికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

