Padi Kaushik Reddy : గుండాలు, పోలీసులతో వచ్చి తన ఇంటిపై దాడి చేసిన అరికపూడి గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం మధ్యాహ్నం మరో బీఆర్ఎస్ నేత శంభీపూర్ రాజుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన కౌశిక్‌రెడ్డి.. గాంధీ గుండాగిరిపై మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతూనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘గాంధీ గుండాలు గురువారం మా కమ్యూనిటీకి సంబంధించిన గేట్లు ధ్వంసం చేశారు. ఎన్నో ఇండ్ల గ్లాసులు పగుల గొట్టిండ్రు. కార్ల అద్దాలు పగులగొట్టిండ్రు. ఇది కరెక్టా..? అని అడుగుతున్నా. ఇంత చేసి నన్నేమన్నా చేసిండ్రా..? నా వెంట్రుక కూడా పీకలేకపోయారు. గాంధీ నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అంటున్నవ్. అయితే బీఆర్ఎస్ కండువా కప్పుకో. నేను గాంధీ ఇంటర్వూలు చూసిన. ఆయన వెనుక వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బొమ్మ ఉన్నది. ఇంటిచుట్టూ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఉన్నయ్. కాంగ్రెస్ నాయకుల బొమ్మలు ఉన్నయ్. ఇట్లాంటోళ్లు మనకు అవసరమా అనేది సమాజం ఆలోచన చేయాలె.’ అని సూచించారు.
అదేవిధంగా దాడి సమయంలో అరికపూడి గాంధీ.. కౌశిక్ రెడ్డి గురించి దురుసుగా మాట్లాడిన ఓ వీడియోను మీడియాకు చూపించారు. ఆ వీడియోలో కౌశిక్‌రెడ్డిని ఉద్దేశించి గాంధీ మీడియాతో.. ‘నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు దేనికి వచ్చావ్రా..? ఈ విల్లాస్‌లో దేనికి ఉంటున్నావ్ రా..?’ అని దురుసుగా మాట్లాడారు. దీనిపై కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు కూడా ఆ భాష వచ్చు. నేను కూడా అరే గాంధీ, ఒరే గాంధీ, రారా గాంధీ, పోరా గాంధీ అనొచ్చు. కానీ మాకు కేసీఆర్ సంస్కారం నేర్పిండ్రు. ఆ సంస్కారం అడ్డొస్తున్నది’ అన్నారు.