నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 24: బీఆర్ఎస్ టికెట్ ఖరారైన తరువాత మొదటిసారి నియోజకవర్గంలో అడుగుపెట్టిన తమ అభిమాన నేతలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, తిలకం దిద్ది ఆహ్వానించారు. ఈ సందర్భంగా భారీ బైక్, కారు ర్యాలీలు నిర్వహించారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు ఘన స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం ఆందోళ్‌మైసమ్మ దేవాలయానికి చేరుకున్న మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. శాలువాలతో సన్మానించి చౌటుప్పల్ పట్టణ కేంద్రం, సంస్థాన్ నారాయణపురం మీదుగా భారీ కార్ల ర్యాలీ కొనసాగింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న కోనేరు కోనప్పకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీ తీశారు.
Brsmlas