హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): లగచర్ల దాడి ఘటనలో ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని బీఆర్ఎస్ లీగల్‌సెల్ కన్వీనర్ సోమ భరత్‌కుమార్ పేర్కొన్నారు. దాడి తో ఎలాంటి సంబంధం లేని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు.
చర్లపల్లి సెంట్రల్ జైలు వద్ద నరేందర్‌రెడ్డిని కలిసి వచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి కుట్రపూరితంగా పట్నంపై కేసులు బనాయించారని, ఇది పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు. తాము పట్నంను కలిసినప్పుడు ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చారని, అందులో తానేమీ చెప్పకుండానే రిమాండ్ రిపోర్ట్ తయారు చేసినట్టు నరేందర్‌రెడ్డి చెప్పారని భరత్ పేర్కొన్నారు.
రేవంత్ సర్కార్ కుట్రపూరితంగా కేటీఆర్‌తో పాటు ఇతర నేతలను ఈ కేసులో చేరుస్తున్నారని మండిపడ్డారు. నరేందర్‌రెడ్డి అరెస్ట్ విషయంలో కొడంగల్ పోలీసుల తీరు శోచనీయమని, కేటీఆర్ పేరుగాని, ఇతరుల పేరుగాని తానుచెప్పలేదని నరేందర్‌రెడ్డి చెప్పారని పేర్కొన్నారు.