భూత్పూర్, జనవరి 24 : బీఆర్ఎస్ నేతలపై దాడులను సహించేది లేదని పార్టీ నా యకులు హెచ్చరించారు. భూత్పూరు మం డలం మద్దిగట్ల కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త వెంకటేశ్‌గౌడ్‌పై కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ శనివారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులో బీఆర్ఎస్, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. వెంకటేశ్‌పై దాడికి పాల్పడిన అధికార పార్టీ నాయకులను వెంటనే అరెస్టు చేయాల ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏ ఒక్క కాంగ్రెస్ నేతపై కక్ష సాధింపుగా కేసులు నమోదు చేయలేదని గుర్తుచేశారు. రెండేండ్ల రేవంత్ పాలనలో దేవరకద్ర నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలపై ఎన్నో అక్రమ కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దిగట్లలో బీఆర్ఎస్ కార్యకర్త వెంకటేశ్ కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేయలేదన్న కారణంతో కారులో ఎత్తుకెళ్లి దాడులకు దిగారని ఆరోపించారు. ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు.