హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఖండించారు. కేసీఆర్, కేటీఆర్‌ను రాజకీయంగా ఎదురోలేక వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధాకరమని పేర్కొన్నారు. అర్థంపర్థం లేని మాటలు, నిందారోపణలతో ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన పట్ల విసిగి పోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఈ నిర్బంధం ఏంది?: జీవన్ రెడ్డి

Jeevanreddy
సారంగాపూర్, సెప్టెంబర్ 30 : తెలంగాణ రాష్ట్రంలో ఈ నిర్బంధమేందని, ప్రజాస్వామ్యంలో కనీసం ప్రశ్నించే హక్కు లేదా..? అని బీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమ నిర్బందాలు, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి రైతుల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వానకాలం పంటలను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
నాడు కేసీఆర్ సభ అంటే వరాలు.. నేడు రేవంత్ సభ అంటే బూతులు: సండ్ర

Sathupalli Sandra Venkata
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏ ప్రాంతానికి వెళ్లినా నియోజకవర్గాల అభివృద్ధి కోసం వరాల జల్లు కురిపించేవారని, నేడు కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి సభ అంటే కేవలం బూతుల జల్లు మాత్రమే కురుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిరిసిల్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు అత్యంత దిగజారుడుతనానికి నిదర్శనమని, దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఒక చిల్లర మనిషి మాదిరిగా మాట్లాడారని ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.