సూర్యచంద్రులున్నంతకాలం కేసీఆర్ ఆనవాళ్లు: గండ్ర
సూర్యచంద్రులు ఉన్నంతకాలం.. తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లు ఉంటాయని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పడి పదేండ్లు అవుతున్న సందర్భంగా శనివారం భూపాలపల్లి జిల్లాకేంద్రంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక హనుమాన్ దేవాలయంలో బీఆర్ఎస్ శ్రేణులతో గండ్ర ప్రత్యేక పూజలు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): సూర్యచంద్రులు ఉన్నంతకాలం.. తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లు ఉంటాయని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పడి పదేండ్లు అవుతున్న సందర్భంగా శనివారం భూపాలపల్లి జిల్లాకేంద్రంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక హనుమాన్ దేవాలయంలో బీఆర్ఎస్ శ్రేణులతో గండ్ర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అకడి నుంచి మెడికల్ కళాశాల మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు 500 బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. అంబేదర్, జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కలెక్టర్‌రేట్ ఆవరణలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంగా ఉండి అభివృద్ధికి నోచుకోని భూపాలపల్లిని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 2016 అక్టోబర్ 11న తెలంగాణ సిద్ధ్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. జిల్లా ఏర్పాటు అనేది ఈ ప్రాంత అభివృద్ధిపై కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ఆలోచించి తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అర్బన్ మాజీ అధ్యక్షుడు కటకం జనార్దన్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీశ్‌రెడ్డి, తదితరులు పాల్గ్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

