రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు బీరం హర్షవర్దన్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా మండిపడ్డారు. ఆమె ఆరోపణలపై భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి అసత్య, చిల్లర ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని బీరం హర్షవర్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాటి మహిళల మీద ఇంతటి నికృష్ట ప్రచారం చేయడం మీకే చెల్లిందంటూ కొండా సురేఖపై మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఇంత బాధ్యతారహితంగా మాట్లాడటం చాలా బాధకరమని విమర్శించారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఇలా మాట్లాడటం బాధాకరమని అన్నారు. ఒక బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యతరహితంగా మాట్లాడటం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మీకున్న పదవి వాడుకుని ప్రజలకు మంచి పనులు చేసి వార్తల్లో నిలవాలని హితవు పలికారు.