Y Satish Reddy | నవీన్ యాదవ్ ఓటు హక్కు రద్దు చేయాలి.. వై సతీష్ రెడ్డి డిమాండ్
Y Satish Reddy | జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఓటు హక్కు రద్దు చేయాలని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ను మాత్రమే కాదు.. రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు.
Y Satish Reddy | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఓటు హక్కు రద్దు చేయాలని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ను మాత్రమే కాదు.. రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు.
చెప్పేవి నీతి సూక్తులు.. చేసేటివి ఛండాలపు పనులు అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ పనితీరు. ఓ వైపు రాహుల్ గాంధీ.. ఓట్ చోరీ అంటూ దేశమంతా తిరుగుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీ తొత్తుగా మారిందని మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం.. కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎన్నికల నిబంధనలను దర్జాగా ఉల్లంఘిస్తున్నారు అని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకుడు, టికెట్ రేసులో ఉన్న నవీన్ యాదవ్.. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత.. ఓటరు కార్డులు పంపిణీ చేయడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వనీతికి.. చట్టాలపై వారికి ఉన్న గౌరవానికి నిదర్శనం. ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల్సిన ఓటరుకార్డులను అధికార పార్టీ పంపిణీ చేస్తోందంటే.. బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి.. తెలంగాణలో అనుముల రాజ్యాంగం ఏ స్థాయిలో అమలు చేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల కోడ్ మాత్రమే కాదు.. రాజ్యాంగాన్ని కూడాకాంగ్రెస్ పార్టీ ఉల్లంఘిస్తోంది అని సతీష్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఓ వైపు రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకుని నీతులు చెబుతారు.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ నాయకులు.. ఆ రాజ్యాంగాన్ని పాటించరు. వాళ్లకంటూకొత్తగా అనుముల రాజ్యాంగాన్ని రాసుకుని నడిపిస్తుంటారు. ఎలక్షన్ కమిషన్ నిజంగానే నిష్పక్షపాతంగా పనిచేస్తున్నట్టయితే.. వెంటనే నవీన్ యాదవ్ ఓటు హక్కు రద్దు చేయాలి. జూబ్లీహిల్స్ ఓటరు జాబితా నుండి ఆయనను తొలగించాలి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ ఎన్నికల్లో పోటీకి అతడిని అనర్హుడిగా ప్రకటించారు. లేకపోతే ముందు ముందు నిబంధనలకు విరుద్ధంగా ఇంకెన్ని పనులు చూస్తారో ఊహించలేము అని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

