హైదరాబాద్, ఆగస్టు 20, (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేతలపై అవాకులు, చెవాకులు పేలుతున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన నోరు అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ యాదవ్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావుపై పొంగులేటి చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. రెవెన్యూ శాఖలో జరుగుతున్న అక్రమాలు, భూ దందాలను సరిదిద్దడం మాని నిత్యం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై అసత్య ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.