హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : ఐఏఎస్‌ల అసోసియేషన్ ఫిర్యాదుల అనంతరం, అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్టు చేయడం దేనికి సంకేతమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. అసలు ఎవరు తప్పు చేశారు? ఎవరి మీద విచారణ జరుపాలి? అని పేర్కొన్నారు. అసలు ఈ అంశంపై నిజమెంత.. అబద్ధమెంత? ఆయన అనుమానం వ్యక్తంచేశారు. ఎన్టీవీ ప్రసారం చేసిన కథనంలో నిజం లేకపోతే కదా..? ఆ జర్నలిస్టుల మీద విచారణ చేసి, చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ఈ అరెస్టులు ఎవరిని కాపాడే ప్రయత్నమని నిలదీశారు. గతంలో ‘సీఎంవోలో మేడమ్’ అనే కథనం ప్రసారమైనా.. ఎందుకు విచారించలేదని వై సతీశ్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.