RS Praveen Kumar | హైదరాబాద్ : కేసీఆర్ హయాంలో స్థాపించిన దేశంలోనే మూడో మహిళ సంక్షేమ ఆర్మీ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీ నుంచి మొట్టమొదటి సారిగా ఆలిండియా 17వ ర్యాంక్ సాధించి, భారత వాయుసేనలో ఆఫీసర్‌గా సెలెక్ట్ అయిన తెలంగాణ గురుకుల బిడ్డ వుల్దండి కావ్యకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అయితే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. బీబీ నగర్‌లోని ఈ కళాశాలను మూసివేయించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. వుల్దండి కావ్య తెలంగాణ ఆర్మ్డ్ ఫోర్స్ ప్రిపరేటరి డిగ్రీ కాలేజీ నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సెలెక్ట్ కావడం సంతోషంగా ఉందన్నారు. కానీ కేసీఆర్ ఆనవాళ్లు కనిపించొద్దనే ఉద్దేశంతో.. ఈ కాలేజీని రేవంత్ రెడ్డి మూసివేయించారు. దీంతో ఎంతో మంది పేద విద్యార్థినుల ఉజ్వల భవిష్యత్‌ను అడ్డుకున్నట్టైంది.
కేసీఆర్ గారి హయాంలో స్థాపించిన దేశంలోనే మూడవ మహిళ సంక్షేమ ఆర్మీ ప్రిపరేటరీ డిగ్రీ కళాశాల నుండి మొట్టమొదటి సారిగా ఆలిండియా 17 వ ర్యాంకు సాధించి భారత వాయుసేనలో ఆఫీసర్ గా సెలక్టు అయిన తెలంగాణ బిడ్డ వుల్దండి కావ్య కు శుభాభినందనలు 💐💐
ప్రస్తుత సీయం@revanth_anumula గారు బీబీనగర్… pic.twitter.com/KKPBKLZdQ5
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) June 13, 2025