హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేసి దగా చేయడం తప్ప సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు వెలగబెట్టిందేమీ లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. రైతు భరోసాను రూ.12 వేలకు తగ్గించి నమ్మకద్రోహం చేశారని ఆదివారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పచ్చి మోసానికి గణతంత్ర దినోత్సవాన్ని ముహూర్తంగా పెట్టారంటూ మండిపడ్డారు. ‘గత పాలకులు చేసిన అప్పు’ అంటూ అరిగిపోయిన రికార్డులు మళ్లీ మళ్లీ ప్లేచేసి తప్పించుకునేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు. గడిచిన 13 నెలల్లో రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి చేసింది సున్నా అని పేర్కొన్నారు.