RS Praveen Kumar | హైదరాబాద్ : రాష్ట్ర సివిల్ సస్లైస్ కమిషనర్ డీఎస్ చౌహాన్.. ఓ అధికారిలా కాకుండా అధికార పార్టీ ప్రతినిధిలాగా మారిపోవడాన్ని మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుబట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మెప్పు కోసం ఆయన ముందు అబద్ధాలు చెప్పిన ఐపీఎస్ డీఎస్ చౌహాన్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆయనకు ఆర్ఎస్పీ ఒక సూచన చేశారు.
ప్రియమైన బ్యూరోక్రాట్ సహోద్యోగులారా, దయచేసి అధికార పార్టీకి ‘అధికారిక ప్రతినిధులు’గా వ్యవహరించకుండా ఉండండి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఆలిండియా సర్వీస్ ఉద్యోగులు తటస్థంగా ఉండటమే కాకుండా, తటస్థంగా ఉన్నట్లు కూడా కనిపించాలి అని ఆర్ఎస్పీ సూచించారు. దయచేసి రికార్డులను వెరిఫై చేసి.. వాటికి అనుగుణంగా మీ సంబంధిత మంత్రులకు మార్గనిర్దేశం చేయండి అని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుండి 2023 వరకు అర్హులైన పేద ప్రజలకు 6.47 లక్షల రేషన్ కార్డులను జారీ చేసింది అని ఆర్ఎస్పీ గుర్తు చేశారు. ఈ విషయాన్ని మరిచి, గత ప్రభుత్వం అసలు రేషన్ కార్డులే మంజూరు చేయలేదని డీఎస్ చౌహాన్ వ్యాఖ్యానించడం సరికాదని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
నిన్న బంజారాహిల్స్‌లోని బంజారా భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదు అంటూ రాజకీయ నాయకుడి లాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు వాస్తవం.. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2016 నుండి 2023 వరకు ఇచ్చిన రేషన్ కార్డుల సంఖ్య 6,47,479. ఐపీఎస్ అధికారి హోదాలో ఉండి ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం దాచి అబద్ధాలు చెప్పడం సబబేనా అని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు.
Dear bureaucrat colleagues,
Please stay away from acting as ‘official spokespersons’ of ruling party. We are governed by All India Services (Conduct) 1968 and we should not only be neutral, but also appear to be neutral.Please verify the records thoroughly and guide your… pic.twitter.com/bM8ERCippi
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) August 2, 2025