కాంగ్రెస్ అహంకారానికి ఇది నిదర్శనం.. భువనగిరి జడ్పీ చైర్మన్‌పై దౌర్జన్యంపై రావుల మండిపాటు
యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని పోలీసులతో నెట్టివేయటం సరికాదని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సందీప్ రెడ్డిపై దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఓడిపోయిన నేతలు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని.. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను అవమానిస్తున్నారని తెలిపారు.
యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని పోలీసులతో నెట్టివేయటం సరికాదని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సందీప్ రెడ్డిపై దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఓడిపోయిన నేతలు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని.. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను అవమానిస్తున్నారని తెలిపారు.
మంత్రుల్ని ప్రశ్నిస్తే పోలీసుల్ని రెచ్చగొట్టి నెట్టివేస్తున్నారని రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. మంత్రులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని.. పోలీసులు మంత్రులకు ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సందీప్ రెడ్డిపై దౌర్జన్యానికి పాల్పడిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. మంత్రులు ఈ రకంగా వ్యవహరించటం సిగ్గు చేటు అని విమర్శించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
అసలేం జరిగింది?
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గూడూరు(Guduru) గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కాగా, ఇదే సభలో జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడం కాకుండా బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లడం సరికాదని సందీప్ రెడ్డి తెలిపారు. రైతుబంధు అడిగినోళ్లను చెప్పుతో కొట్టాలనడం మంచి పద్ధతి కాదని సూచించారు.
సందీప్ రెడ్డి మాట్లాడుతుండగానే మంత్రి కోమటిరెడ్డి మధ్యలో జోక్యం చేసుకొని మాధవరెడ్డి ఒక మహా నాయకుడు.. ఆయన కడుపులో పుట్టిన సందీప్ రెడ్డి ఒక బచ్చా అన్నారు. కనీసం వార్డ్ మెంబర్ గెలిచే స్థాయిలో కూడా ఆయన లేడని వ్యక్తిగత దూషణలకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఇంతలోనే కాంగ్రెస్ శ్రేణులు స్టేజీపైకి వచ్చి హంగామా సృష్టించారు. సందీప్ రెడ్డిని తోసి వేసి క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అతడిని అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్లారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్
Comrade Kalyan | 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభం!
Prasidh Krishna: కివీస్‌తో వన్డేలకు ప్రసిద్ధ కృష్ణ దూరం.. ఇండియా-ఏ జట్టులోకి సిరాజ్
Mirzapur: The Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ షురూ!
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

