హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజలు మెచ్చేవిధంగా మాట్లాడాలని బీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. అంతేకానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వాఖ్యలు చేయడం చాలా బాధాకరమని తెలిపారు.
ప్రాణాలను పణంగాపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన మహానాయకుడు కేసీఆర్‌ను దూషించడం సిగ్గుచేటని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి.. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, ఇచ్చిన హామీలను గాలికివదిలేశారని విరుచుకుపడ్డారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ జోలికొస్తే రేవంత్‌రెడ్డి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖబర్దార్ రేవంత్.. భాష మార్చుకో, వ్యవహారం మార్చుకో.. లేకపోతే తెలంగాణ ప్రజలు ఎకడికకడ నిలదీస్తారు అని హెచ్చరించారు.