హైదరాబాద్ : రేవంత్ రెడ్డి సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో అపరిచితుడిలా మాట్లాడారని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అన్నారు. ఫామ్‌హౌస్‌లో మానవ మృగాలు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ.. కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినప్పుడు తెలంగాణ వ్యతిరేక శిబిరంలో ఉన్నవాళ్లు మానవామృగాలని మండిపడ్డారు. కోదండరామ్‌ను ఎమ్మెల్సీని చేయకుండా తామెందుకు ఆపుతామని అన్నారు.
బీసీ నేత దాసోజు శ్రవణ్, ఎస్టీ నేత కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలు కాకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని బాలరాజ్ యాదవ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ సీఎంగా మారారని ఎద్దేవా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి ఒక్కరే పోలేదని, 2017లో సీఎం హోదాలో కేసీఆర్ ఓపెన్ మీటింగ్‌కు వెళ్లారని, ఓయూ శతాబ్ధి
ఉత్సవాల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ఓయూకు పోలీసుల పహారాలో, కాంగ్రెస్
కార్యకర్తలకు పాసులు ఇచ్చుకుని వెళ్లారని విమర్శించారు.
హెచ్‌సీయూ భూములు అమ్ముకునే వాళ్ళు మానవ మృగాలని, లగచర్లలో గిరిజన రైతులపై లాఠీచార్జి చేసిన వాళ్ళు మానవమృగాలని యాదవ్ మండిపడ్డారు.