అధికార దుర్వినియోగంతో నియంతృత్వ పాలన
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సీఎం రేవంత్ ఖూనీ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత డా క్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఆయన పే ర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. ‘హైదరాబాద్‌కు మీ ప్రచారరహిత, నిరాడంబరమైన రాక సాధారణ ప్రజానాయకత్వానికి ఉదాహరణ. ఎలాంటి హంగామా లేకుం డా పూర్తిగా భిన్నం గా, మీరు చూపిస్తున్న వినయపూర్వ క నాయకత్వాన్ని అభినందిస్తున్నాం. తెలంగాణ ఇప్పుడు ప్రజాస్వామ్యానికి దూరమవుతూ, పోలీసు రా జ్యం, తీవ్రమైన అవినీతికి నిలయంగా మారిం ది.
14 నెలల రేవంత్‌రెడ్డి పాలనలో, ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యంగా మారాయి. ప్రభుత్వం రాజకీయ దౌర్జన్యం, వ్యక్తిగత లా భాలు, ప్రయోజనాలకు సాధనంగా మారిం ది. అవినీతి, కక్షసాధింపు, పరిపాలనా అస్తవ్యస్తంగా నిండిపోయాయి. ప్రభుత్వం న్యాయవ్యవస్థ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. పో లీసుశాఖ, శాంతి భద్రతల పరిరక్షణకు కా కుండా, ప్రతిపక్ష నేతలు, సామాజిక ఉద్యమకారులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వ్య క్తులపై ఒత్తిడి తెచ్చేందుకు వాడుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయ ఒత్తిడికి లొంగిపోతూ, కుట్రలకు పావులుగా మా రారు. రైతుల సంక్షోభం, నిరుద్యోగ సమస్య లు, ఆర్థిక క్షీణత, సంక్షేమ పథకాల నిర్వీర్యత వంటి సమస్యలను పరిషరించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికా లేదు. హామీలతో ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టినా, ప్రభుత్వాన్ని నడపడంలో రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. ఈ సంక్షోభ సమయంలో రాష్ట్ర ఇన్చార్జిగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మళ్లీ మీరు పునరుద్ధరిస్తారని మేము ఆశిస్తు న్నాం’ అని లేఖలో దాసోజు పేర్కొన్నారు.