మందమర్రి, జూన్ 5 : వడదెబ్బతో బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రిలోని కోదండ రామాలయ కాలనీకి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మారం రామకృష్ణ(45) పని నిమిత్తం రెండు రోజులపాటు ఎండలో తిరిగాడు.
గురువారం సాయంత్రం ఇంటికి చేరిన రామకృష్ణ.. స్నేహితులు ఫోన్ చేస్తే స్పందించలేదు. దీంతో శుక్రవారం ఉదయం ఇంటికి వెళ్లి చూడగా నిర్జీవంగా కనిపించాడు. ఎస్సై గోపతి నరేశ్ అక్కడికి చేరుకొని రామకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రామకృష్ణ మృతిపట్ల బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు.