హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు వీధిరౌడీలను తలపించిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్ స్లిప్పులు పట్టుకొని విచ్చలవిడిగా నోట్లకట్టలతో ఓటర్లను ప్రలోభపెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
డిప్యూటీ సీఎం పోలింగ్ బూత్‌ల మీదుగా కాన్వాయ్‌తో యథేచ్ఛగా తిరగడం ఏంటని ప్రశ్నించారు. రామచంద్రనాయక్ తాను డిప్యూటీ స్పీకర్ అనే విషయం మరిచిపోయి రోడ్లపై తిరుగుతూ నోట్లకట్టలు పంచాడని రాకేశ్‌రెడ్డి ఆరోపించారు. ఇంతమాత్రం దానికి ఎన్నికలు, ప్రచారం ఎందుకని, డైరెక్ట్‌గా ఈవీఎంలు ఇంటికి తీసుకెళ్లి ఓట్లు గుద్దుకుంటే సరిపోద్ది కదా అని రాకేశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.