బీజేపీతో సీఎం రేవంత్ కుమ్మక్కు
కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుమ్మక్కు అయ్యారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బాధవస్తే రేవంత్‌రెడ్డి ఏడ్చే పరిస్థితి ఉన్నదని ఎద్దేవా చేశారు. మూడు రోజుల కిందట రాహుల్ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు 79వసారి ఢిల్లీ వెళ్లిన ఆయన ఆరు గంటలపాటు గాయబ్ అయ్యారని, మంత్రి పొంగులేటిని వెంటబెట్టుకొని బీజేపీ పెద్దలను కలిసి మంత్రిని ఈడీ కేసు నుంచి తప్పించేందుకు యత్నించారని ఆరోపించారు.
- ఈడీ కేసు నుంచి పొంగులేటిని తప్పించేందుకే ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ కార్యక్రమాలు
- కాంగ్రెస్ నేతలవి క్షుద్రరాజకీయాలు
- కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుమ్మక్కు అయ్యారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బాధవస్తే రేవంత్‌రెడ్డి ఏడ్చే పరిస్థితి ఉన్నదని ఎద్దేవా చేశారు. మూడు రోజుల కిందట రాహుల్ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు 79వసారి ఢిల్లీ వెళ్లిన ఆయన ఆరు గంటలపాటు గాయబ్ అయ్యారని, మంత్రి పొంగులేటిని వెంటబెట్టుకొని బీజేపీ పెద్దలను కలిసి మంత్రిని ఈడీ కేసు నుంచి తప్పించేందుకు యత్నించారని ఆరోపించారు. శనివారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేతలు గౌతంప్రసాద్, కోట్ల మహిపాల్ ముదిరాజ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
రేవంత్‌రెడ్డి ఎక్కడికెళ్లినా గాయబ్ అవుతారని, గతంలో హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి కనిపించకుండా పోయారని గుర్తుచేశారు. ‘రేవంత్ నటించిన చిత్రం పేరు గాయబ్.. అందులో పాత్రధారులు రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్’ అని చురకలంటించారు. రెండేండ్ల క్రితం పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు చేసి రూ.600 కోట్లు పట్టుబడ్డ నెల తర్వాత పొంగులేటి ఐటీసీ కోహినూర్ హోటల్లో అదానీని కలిశారని, అయితే విమర్శలు రావడంతో యంగ్ ఇండియా స్కూళ్ల కోసమని బుకాయించారని తెలిపారు. కేంద్రంలో బద్ధశత్రువులుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో మాత్రం దోస్తానా చేస్తున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ బీఆర్ఎస్పై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి కుటుంబీకుల అక్రమాలను బీఆర్ఎస్ ఆధారాలతో సహా బయటపెట్టిందని, దీనిపై బీజేపీ నేతలు మౌనం వహించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
అఘోరాల్లా కాంగ్రెస్ నేతల తీరు..
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ అఘోరాల్లా వ్యవహరిస్తూ క్షుద్రరాజకీయాలకు పాల్పడుతున్నారని బాలరాజుయాదవ్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉంటే పవర్ కట్స్, ఎండుతున్న పంటల గురించి మాట్లాడాలని హితవుపలికారు. ‘బల్మూరి.. ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా నువ్వు చేసిన లుచ్చా పనుల గురించి చెప్పాలా? యాడ్ ఏజెన్సీకి చెందిన ఓ మహిళను సీఎంతో అపాయింట్మెంట్ ఇప్పిస్తానని ఏం చేశావో చెప్పాలా? అద్దంకి.. మీ ముఖ్యమంత్రి మైహోం భుజాలో ఏం జరిగిందో బయటపెట్టాలా? రాహుల్ చైనాకు ఎందుకు వెళ్లాడో వెల్లడించాలా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌పై విమర్శలు చేసే ముందు హైదరాబాద్‌లో కట్టిన ఫ్లై ఓవర్లు, తీసుకొచ్చిన గూగుల్, అమెజాన్ కంపెనీల గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. హిట్లర్‌లా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి చుట్టూ బల్మూరి, అద్దంకి లాంటి అనేకమంది గోబెల్స్ నాయకులు తయారయ్యారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్న రేవంత్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

