MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఖచ్చితంగా రాజకీయ కుట్ర అని బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ శాఖ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆరోపించారు. కవిత అరెస్ట్ అంతా ప్రణాళిక ప్రకారమే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెల్లడికి ఒక రోజు జరిగిందన్నారు. అందులోనూ శుక్రవారం రాత్రి ఒక ఆడబిడ్డ ను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే రాజకీయ దురుద్దేశంతోనే కవితని అరెస్ట్ చేశారన్నారు.
ఈ అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అభిలాష గొడిశాల అన్నారు. ఉద్యమాలు, కేసులు, అక్రమ అరెస్టులు బీఆర్ఎస్ పార్టీకి కొత్తేమీ కాదన్నారు. ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. కవితకు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం, ఎన్నారైలంతా అండగా ఉంటామని, చట్టపరంగా న్యాయస్థానంలో పోరాడుతామని అభిలాష అన్నారు.