ఇచ్చోడ, ఆగస్టు 24: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామస్థులు గురువారం ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో సర్పంచ్ గాడ్గె మీనాక్షి మాట్లాడుతూ.. నాటి నుంచి కేసీఆర్ వెంటే ఉన్నామని భవిష్యత్తులోనూ ఆయన వెంటే ఉంటామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభు త్వ హయాంలో ముక్రా(కే)లో రూ.38 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని, గ్రా మం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందంటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి వల్లేనని స్పష్టం చేశారు. గ్రామంలో మొత్తం 666 ఓట్లు ఉండగా.. వచ్చే ఎన్నికల్లో అన్ని ఓట్లు కారు గుర్తుకే వేస్తామని గ్రామస్థులు ప్రమాణం చేశారు.