హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ‘పదవులొచ్చాయని నిజాలు దాస్తే ఎలా? కమలాపూర్ ప్రశ్నపత్రం లీక్ కేసును మరిచారా?’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ప్రజల కు నిజాలు చెప్పాలని, అవాస్తవాలతో వాటిని వక్రీకరించొద్దని హితవు పలికారు. పదవులోచ్చాయని నిజాలు దాస్తే ఎలా?.. అని బండి సంజయ్ తీరుపై ఎక్స్ వేదికగా శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి సంధించిన ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కమలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎస్సెస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయే ప్రధాన కుట్రదారుడు (ఏ-1) అని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. వాట్సాప్ చాట్ల ఆధారం గా నాటి వరంగల్ సీపీ రంగనాథ్ పర్యవేక్షణలో ఈ కేసు నమోదైందని తెలిపారు.
2025 నవంబర్‌లో హైకోర్టు ఈ కేసులో ప్రొసీడింగ్స్‌ను క్వాష్ చేసినప్పటికీ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని పేరొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి- బండి సంజయ్ మధ్య స్నేహం కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మౌనం వహించిందని తెలిపారు. ఎలాంటి క్రిమినల్ కేసు లు, ఆరోపణలు లేని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు.
తన కుమారుడిపై నమోదైన కేసులో బాధితురాలైన మైనర్ బాలికను బెదిరించారనే తీవ్రమైన ఆరోపణలను బండి సంజయ్ కూడా ఎదురొంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎత్తిచూపారు. బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విచారణకు సహకరించాల్సింది పోయి, చట్టానికి అతీతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒకవైపు పోక్సో కేసు నిందితుడిని రక్షిస్తూ, మరోవైపు పోలీసులు స్వేచ్ఛగా తిప్పడంపై ఆయన విస్మయం వ్యక్తంచేశారు.