మత్స్యకారులను తక్షణం ఆదుకోవాలి
రాష్ట్రంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు చేప విత్తనాలకు బదులుగా చెరువుల విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని నగదు రూపంలో ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరపల్లిలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులను ఆదివారం ఆయన కలిశారు.
- సీఎంకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి లేఖ
రాయికల్, అక్టోబర్ 25 : రాష్ట్రంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు చేప విత్తనాలకు బదులుగా చెరువుల విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని నగదు రూపంలో ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరపల్లిలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులను ఆదివారం ఆయన కలిశారు.
అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మత్స్యపారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు చెరువుల్లో వేసేందుకు చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ, నిరుడు, ఈ ఏడాది సరైన సమయంలో పంపిణీ చేయలేదని అన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో చెరువుల్లో పిల్లలు పోసినప్పుడే అవి ఆశించినంతగా వృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ప్రభుత్వం నుంచి వచ్చే చేపపిల్లల కోసం ఎదురుచూడకుండా తమ సొంత నిధులతో జూలైలోనే కొనుగోలు చేసుకుని చెరువుల్లో పోసుకున్నారని, ఈ ఏడాది కూడా అలాగే చేశారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

