Gadari Kishore Kumar | మూసీ కన్నా ముందు రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి నోర్లను ప్రక్షాళన చేయాలి : గాదరి కిశోర్ కుమార్
Gadari Kishore Kumar | రామన్నపేటలో అంబుజా ఫ్యాక్టరీ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దని తాము ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పడానికి వెళ్తుంటే పోలీసులు ఎవరి డైరెక్షన్లో తమను అడ్డుకుంటున్నారో రాచకొండ సీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Gadari Kishore Kumar | నల్లగొండ : రామన్నపేటలో అంబుజా ఫ్యాక్టరీ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దని తాము ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పడానికి వెళ్తుంటే పోలీసులు ఎవరి డైరెక్షన్లో తమను అడ్డుకుంటున్నారో రాచకొండ సీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గాదరి కిశోర్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పి, 12 లక్షల చెట్లు కొట్టి నాశనం చేయడం, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీతో ధర్మారెడ్డి కాల్వలో వ్యర్థాలు పోయడం నాశనం కాదా అని ప్రశ్నించారు. మూసీ వల్ల నల్లగొండ నాశనమైతుందన్న కోమటిరెడ్డి ఇయ్యాల అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణకు ఎందుకు రాలేదన్నారు. మూసీనీ కాదు, ముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నోర్లను ప్రక్షాళన చేయాలన్నారు.
ఇంజినీర్లకు సీనియర్ ఇంజినీర్‌గా సలహాలు ఇస్తున్నావు కదా, అసలు నీవు ఎక్కడ ఇంజినీర్ చేశావో తెల్వదా అని కోమటిరెడ్డిని ప్రశ్నించారు. ఓ కాల్వ నిర్మాణంలో సూపర్వైజర్గా పనిచేస్తూ, ఆ కాల్వ సిమెంట్ అమ్ముకొని మర్రిగూడ జగతయ్యతో బీర్లు తెచ్చుకొని కాల్వలో తాగిన విషయం అందరికీ తెలుసన్నారు. అలాంటి కోమటరెడ్డి.. కేటీఆర్‌ను విమర్శించే స్థాయికి ఎదిగావా అని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ర్టానికి, కనీసం సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు కూడా రూపాయి ఇవ్వని అదానీ సీఎం రేవంత్‌కు రూ.100 కోట్లు స్కిల్ డెవల్మెంట్ పేరుమీద, మరో రూ.వెయ్యి కోట్లు వారి అధిష్టానానికి ఇవ్వడానికి కారణం ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులను అప్పజెప్పేందుకే అని దుయ్యబట్టారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డిని ఎవరూ సమర్థించడం లేదని, హైడ్రా పేరుతో సామాన్యులు, రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా చేపట్టడం లేదని రైతులు, ఉద్యోగాలు వేయడం లేదని నిరుద్యోగులు, రీయింబర్స్మెంట్ లేదని విద్యార్థులు, పింఛన్ ఇవ్వడం లేదని వృద్దులు, 29 జీవోతో నిరుద్యోగ అభ్యర్థులు.. ఇలా రాష్ట్రంలో తిట్టని వాళ్లే లేరని కిశోర్ కుమార్ పేర్కొన్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మాటలతో ర్యాగింగ్ చేసిన గాదరి కిషోర్
సిమెంట్ బస్తాలు అమ్ముకుంటూ అక్కడే కూర్చొని బీర్లు తాగే వాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీనియర్ ఇంజనీర్ కాదు మున్నా భాయ్ ఇంజనీర్ - గాదరి కిషోర్. pic.twitter.com/EOCXqQpHqp
— Telugu Scribe (@TeluguScribe) October 23, 2024
ఇవి కూడా చదవండి..
Gadwal | భర్త మృతి చెందిన 3 గంటలకే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Harish Rao | రాహుల్ గాంధీ ద్వంద్వ విధానాలపై హరీశ్ రావు ఫైర్
KTR | కొండా సురేఖ వ్యాఖ్యలతో నా పరువు, ప్రతిష్ట దెబ్బతిన్నాయి.. కోర్టులో కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

