Samala Hema | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవంలో సీతాఫల్మండి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ ఇస్రో చైర్మెన్ డాక్టర్ వి. నారాయణన్ చేతుల మీదుగా పీహెచ్డీ పట్టాను అందుకున్నారు. ఆమె ఓయూ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ‘తెలంగాణ రాష్ట్రంలో ఐటీ వ్యవస్థాపకులను ప్రోత్సహించడంలో టీ హబ్ మరియు డబ్ల్యూఈ పాత్ర’అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ సాధించారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.