హైదరాబాద్, జూన్ 17 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పార్టీ ఎన్నారై సెల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాలను ప్రశంసించారు. అమెరికాలోని డాలస్లో ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించిన మహేశ్ బిగాల మంగళవారం కేసీఆర్ను ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందజేశారు. కేసీఆర్కు డాలస్ సభ తీరుతెన్నులు, వచ్చిన స్పందనను ఆయన వివరించారు. ఈ సందర్భంగా మహేశ్ బిగాలను కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.