KCR : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడైన తన్నీరు హరీశ్ రావు (Harish Rao) తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు భౌతిక కాయానికి పార్టీ అధినేత కేసీఆర్ (KCR) నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించారు. తన బావ సత్యనారాయణరావు (కేసీఆర్ 7వ సోదరి (అక్క) లక్ష్మి భర్త) తో తన అనుబంధాన్ని స్మరించుకున్నారు.
సత్యనారాయణరావు మృతిపట్ల విచారం వ్యక్తంచేశారు. తన సోదరి లక్ష్మిని, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. సత్యనారాయణరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంతకుముందు సత్యనారయణ రావు మృతి విషయం తెలిసిన వెంటనే కేసీఆర్ ఫోన్లో హరీశ్ రావును పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్ https://t.co/5WhV7ISFh4 pic.twitter.com/RA5uoKiyFO
— Telugu Scribe (@TeluguScribe) October 28, 2025