KCR | హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు స్వేచ్ఛ వొటార్కర్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సామాజిక స్పృహ వున్న కవయిత్రిగా, జర్నలిస్టుగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ తల్లిదండ్రులు సహచర శంకర్, శ్రీదేవిలు చురుకుగా పాల్గొన్నారని, బిడ్డను కోల్పోయి శోకతప్త హృదయులైన వారికి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.