KCR | గోబెల్స్ బతికుంటే సిగ్గుతో చనిపోతుండే.. బీజేపీపై కేసీఆర్ విమర్శలు
KCR | గోబెల్స్ అనేటోడు బతికి ఉంటే పాప వాడు సిగ్గుతో చనిపోతుండే.. అంత గోబెల్స్ ప్రచారం చేస్తది బీజేపీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పదేండ్ల కాలంలో ట్రాష్, గ్యాస్ తప్ప.. మోదీ చేసిందేమీ లేదు.. ఏ ఒక్క వర్గం ప్రజలకు కూడా మేలు జరగలేదు అని కేసీఆర్ స్పష్టం చేశారు.
KCR | హైదరాబాద్ : గోబెల్స్ అనేటోడు బతికి ఉంటే పాప వాడు సిగ్గుతో చనిపోతుండే.. అంత గోబెల్స్ ప్రచారం చేస్తది బీజేపీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పదేండ్ల కాలంలో ట్రాష్, గ్యాస్ తప్ప.. మోదీ చేసిందేమీ లేదు.. ఏ ఒక్క వర్గం ప్రజలకు కూడా మేలు జరగలేదు అని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
బీజేపీ ఎంజెడాలో రైతులు, పేదలు, సామాన్య ప్రజలు, దళితులు ఉండరు. ఈ పదేండ్లలో పేదల గురించి మోదీ పట్టించుకోలేదు. 2014 నుంచి 150 నినాదాలు ఇచ్చారు. ఏ ఒక్క నినాదం కూడా ఆచరణలోకి రాలేదు. 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు. అర్బన్ నక్సలైట్లు అని వారిని హత్య చేశాడు. యూపీ ఎన్నికల నేపథ్యంలో నల్ల చట్టాలు వాపస్ తీసుకుని క్షమాపణ వేడుకున్న అతి దుర్మార్గమైన ప్రధాని మోదీ. మేకిన్ ఇండియా లేదు.. మన్ను లేదు. డిజిటల్ ఇండియా లేదు. స్మార్ట్ సిటీలు ఒక్కటి కూడా కాలేదు. ఊకదంపుడు మచ్చట్లు తప్ప ఏం లేదు. సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఎక్కడ..? ఈ దేశంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ గుర్తు చేశారు.
భయంకరంగా నిరుద్యోగిత పెరిగింది..
2004-14 మధ్య జీడీపీ 6.8 శాతం ఉంటే.. ఈ దేశానికి ఘనత వహించిన విశ్వ గురు కాలంలో 5.8 శాతం వచ్చింది. దేశం వెనుకకు పోయినట్టా..? ముందుకు పోయినట్టా..? మోదీకి ముందు 6.8 శాతం ఉన్నటువంటి జీడీపీ గ్రోత్ రేట్.. పదేండ్లలో 5.8 శాతానికి వచ్చింది. కనీసం 8 శాతం గ్రోత్ ఉండాలి. చాలా భయంకరంగా నిరుద్యోగిత పెరిగింది. ఒక రకమైన ఉన్మాద స్థితిలోకి ఈ దేశాన్ని నెట్టేస్తున్నారు. విద్వేశం పెచడం తప్ప దేశానికి ఒరిగిందేమీ లేదు. చాలా ఘోరాలు జరిగాయి. బీజేపీ పట్ల కూడా విముఖత ఉంది తెలంగాణ ప్రజల్లో అని కేసీఆర్ పేర్కొన్నారు.
మా మీద పెత్తనం చెలాయిస్తే ఎదురించాం..
గోదావరిని ఎత్తుకుపోతా అని మోదీ అంటుండు. ఎన్‌డబ్ల్యూడీ ఏజెన్సీ ద్వారా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాకు నోటీసులు పంపారు. గోదావరి జలాల తరలింపుపై మీ అభిప్రాయాలు చెప్పకున్నా తీసుకెళ్తాం అంటున్నాడు మోదీ. మనకు ప్రధాన వనరు గోదావరి. అప్పుడప్పుడు కృష్ణా ఎండిపోతది. గోదావరిని తీసుకెళ్తామంటే నేను సీఎంగా ఉన్నప్పుడు అంగీకరించలేదు. తెలుగు రాష్ట్రాల వాటా తేల్చిన తర్వాత సర్ ప్లస్ ఉంటే చెప్తాం అని చెప్పాను. మా వాటా తేల్చకుండా తీసుకెళ్తే.. మేం సాగు తాగునీళ్లకు చావాల్నా అని ఒప్పుకోలేదు. కేఆర్ఎంబీ మా మీద పెత్తనం చెలాయిస్తే ఎదురించాం. సమన్వయ కర్త మీరు అని చెప్పి కేఆర్ఎంబీని హెచ్చరించాను. ఈ దద్దమ్మలు వారికి అప్పగించారు. నాలుగు టీఎంసీల నీళ్లు తీసుకెళ్లారు అని కేసీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

