బీఆర్ఎస్పై జులుం!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దొరికినవాళ్లను దొరికినట్టు ఈడ్చిపారేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇలా ఎవరినీ చూడకుండా అడ్డుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దొరికినవాళ్లను దొరికినట్టు ఈడ్చిపారేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇలా ఎవరినీ చూడకుండా అడ్డుకున్నారు. అడుగు ముందుకు వేయకుండా చుట్టుముట్టారు. అంతేకాదు.. తాను బీఆర్ఎస్ అభ్యర్థినని మాగంటి సునీతా గోపీనాథ్ చెప్పినా పోలీసులు వినలేదు. దీంతో ఆమె కంటతడి పెట్టారు.
బీఆర్ఎస్ ఎంపీనా.. ఐతే ఆగు
బోగస్ ఓటర్లు ఉన్నా మహ్మద్ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్రను అడ్డుకుంటున్న పోలీసులు. తాను ఎంపీనని చెప్పినా వినకుండా చుట్టుముట్టి అడుగు ముందుకు వేయకుండా అడ్డుకున్న పోలీసులు
ప్రశ్నిస్తే దాడులే..

మహమూద్ ఫంక్షన్హాల్లో బోగస్ ఓటర్లు ఉన్నారని నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై చెయ్యి చేసుకున్న పోలీసులు. చిత్రంలో బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను ఈడ్చిపారేస్తున్న పోలీసు
సునీతమ్మ కంటతడి

మహ్మద్ ఫంక్షన్హాల్లో బోగస్ ఓటర్లు ఉన్నారన్న విషయం తెలిసి అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తాను అభ్యర్థినని చెప్పినా వినలేదు. ముందుకు పోనివ్వలేదు. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురై కంట తడి పెట్టిన మాగంటి సునీతా గోపీనాథ్
కాంగ్రెస్ ఆగడాలు కనిపించడం లేదా?

మహ్మద్ ఫంక్షన్‌హాల్ వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు
మా మనిషిపై ఎందుకీ దౌర్జన్యం

జూబ్లీహిల్స్‌లోని ఎల్ఎన్ నగర్లో బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు ఈడ్చుకెళ్తుతుండగా ఎందుకిలా దౌర్జన్యం చేస్తున్నారని నిలదీస్తున్న మాగంటి గోపీనాథ్ కుమార్తె
దివ్యాంగుడైన బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి ఈడ్చివేత

యూసుఫ్‌గూడలోని అమరావతి స్కూల్ వద్ద బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డిని ఈడ్చిపారేస్తున్న పోలీసులు. తాను దివ్యాంగుడినని చెప్పినా వినని పోలీసులు
మాజీ ఎమ్మెల్యే అయితే ఏంటి?

జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ను అడ్డుకుంటున్న పోలీసులు
గులాబీ శ్రేణులపై అడుగడుగునా ఆంక్షలు

యూసుఫ్‌గూడలోని అమరావతి స్కూల్ వద్ద బీఆర్ఎస్ నేత పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
ప్రతిపక్షం గొంతునొక్కి

యూసుఫ్‌గూడలోని అమరావతి స్కూల్ వద్ద బీఆర్ఎస్ నేత సతీశ్‌రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
బీఆర్ఎస్కు నో ఎంట్రీ

మహ్మద్ ఫంక్షన్‌హాల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు గోసుల శ్రీనివాస్, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులను అడ్డుకుంటున్న పోలీసులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

