హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని గురువారం బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం సిడ్నీ నగరం నుంచి ఇక్కడి ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భం గా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెం ట్ రాపోలు రాజేశ్గిరి మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో ఓటర్లంతా విజ్ఞతతో ఆలోచించి, ప్రజల పక్షాన ప్రశ్నించే బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
తద్వారా కేవలం జూబ్లీహిల్స్ సమస్యలే కాకుండా, సబ్బండ వర్ణాల తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ బలంగా పోరాడుతుందని పేర్కొన్నారు. చింతామణి రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి, రాష్ట్రాన్ని విధ్వంసం దిశగా నడిపిస్తుందని దుయ్యబట్టారు. కార్యక్రమం లో నాయకులు దూపాటి రవిశంకర్, ముతుకుల్ల పరుశురామ్, రాంపల్లి రాహుల్, సుతారి మధుకర్, సుతారి శ్రీనివాస్, ఎం రాజేశ్ , నర్మేటి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.