ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 3 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్‌లో సోమవారం ఉద యం మహిళా కానిస్టేబుల్ నాగమణిని హత్య చేసిన ఆమె సోదరుడు పరమేశ్‌ను మంగళవారం రిమాండ్‌కు తరలించినట్టు ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలిపారు. భూ సమస్యలతోపాటు కులాంతర వివాహం చేసుకున్నందుకే అక్కను కడతేర్చినట్టు పోలీసుల విచారణలో తేలింది.