Mallanna Temple | బావమరిది కోసం మోకాళ్లపై మేనబావ నడక.. ఐనవోలు మల్లన్నకు మొక్కు చెల్లింపు
Mallanna Temple | ‘ఎవరికేమైతే నాకేంటి.. నేను బా గుంటే చాలు’ అ నుకునే ఈ రోజు ల్లో.. అయిన వా రు, కన్నవారి పట్ల విపరీత బుద్ధులను ప్రదర్శించి.. బంధాలు, బంధుత్వాలను తెంచుకుంటున్న ప్రస్తుత సమాజంలో.. ఓ మేన బావ మానవత్వం చాటా డు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తన బావమరిది క్షేమం కోరి మోకాళ్లపై నడిచి వెళ్లి ఐనవోలు మల్లన్నకు మొక్కు చెల్లించాడు.
ఐనవోలు, మే 26: ‘ఎవరికేమైతే నాకేంటి.. నేను బా గుంటే చాలు’ అ నుకునే ఈ రోజు ల్లో.. అయిన వా రు, కన్నవారి పట్ల విపరీత బుద్ధులను ప్రదర్శించి.. బంధాలు, బంధుత్వాలను తెంచుకుంటున్న ప్రస్తుత సమాజంలో.. ఓ మేన బావ మానవత్వం చాటాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తన బావమరిది క్షేమం కోరి మోకాళ్లపై నడిచి వెళ్లి ఐనవోలు మల్లన్నకు మొక్కు చెల్లించాడు. ఈ అపురూపమైన దృశ్యం ఆదివారం ఐనవోలులో ఆవిష్కృతమైంది.
హనుమకొండ జిల్లా కమలాపుర్ మండలం అంబాలకు చెందిన చింతకాయల నాగరాజు మేన బావమరిది గంధసిరి రజినీకాంత్ ఈ నెల 17న అరెపల్లిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయమై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చిక్సిత పొందుతున్నాడు. ఈ క్రమంలో తన బావమరిది కోలుకుంటే మోకాళ్లపై నడుచుకుంటూ వచ్చి ఐనవోలు మల్లన్నకు మొక్కు చెల్లించుకుంటానని రజినీకాంత్ ప్రమాదానికి గురైన రోజే మొక్కుకున్నట్టు నాగరాజు వెల్లడించాడు.
మల్లికార్జునస్వామి ఆశీస్సులతో తన బావమరిది ఎలాంటి ప్రాణహాని లేకుండా బయటపడ్డాడని, ఈ మేరకు ఆదివారం ఉదయం అంబాల నుంచి ఐనవోలుకు మోకాళ్లపై నడుచుకుంటూ మల్లికార్జునస్వామి సన్నిధికి చేరుకుని మొక్కు చెల్లించినట్టు తెలిపాడు. భక్తి శ్రద్ధలతో మోకాళ్లపై నడుచుకుంటూ వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించిన నాగరాజును ఈవో అద్దంకి నాగేశ్వర్, అర్చకులు స్వామివారి శేష వస్ర్తాలతో సన్మానించారు.
స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఈవో మాట్లాడుతూ.. ఐనవోలు మల్లికార్జునస్వామి భక్తులు కోరిన కోర్కెలను తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

