BRAOU | బంజారాహిల్స్, జూలై 10 : డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈనెల 12 నుంచి 16వరకు జరగనున్న బీఎల్ఐఎస్సీ పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటించనున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్లో తెలుసుకోవాలని సూచించారు. పరీక్ష తేదీల కోసం వర్సిటీకి చెందిన అధ్యయన కేంద్రాలను సంప్రదించాలని కోరారు.