Rakhi Festival | హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 29: రాష్ట్రంలోని జ్యోతిష పండితులు, వేదపండితులు నిర్ణయించిన ప్రకారంగా ఈనెల 31న రాఖీ పండుగ, సెప్టెంబర్ 18న వినాయక చవితి నిర్వహించుకోవాలని బ్రాహ్మణ సేవాసమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, బ్రాహ్మణ పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు త్రౌండ నాగేంద్రశర్మ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర విద్వత్సభ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని వారు సూచించారు.
మంగళవారం హనుమకొండలోని బ్రాహ్మ ణ భవన్లో పురోహిత, బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 18న మధ్యాహ్నవ్యాప్తి, చంద్రోదయ కాలమే వినాయకచవితి పూజలు నిర్వర్తించడం ధర్మప్రకారంగా వస్తుందని తెలిపారు. 19న చవితి తిథి ఉన్నదని 18న వినాయక విగ్రహాలను ప్రతిష్ఠాపన చేసుకుని కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. అక్టోబర్ 14న మహాలయ, పెత్తర అమావాస్య, బతుకమ్మ పండుగ ప్రారంభం, అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ , అక్టోబర్ 23న దసరా నిర్వహించుకోవాలని వారు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కుందూరుపల్లిలో గడ్డం రమేశ్ ఇంటి ఆవరణలో రాఖీ ఆకారంలో పూసిన ఈ పుష్పాలను గ్రామస్థులు ఆసక్తిగా చూస్తున్నారు.