మల్కాజిగిరి, ఏప్రిల్ 19 : బ్రాహ్మణ సమాజ శ్రేయస్సు కోసం తనవంతు తోడ్పా టు అందిస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. మల్కాజిగిరిలో బ్రాహ్మణ ఆత్మీ య సమ్మేళనం, కృతజ్ఞత అభినందన సభ ఆదివారం నిర్వహించారు. బ్రాహ్మణులకు ఎకరం స్థలం కేటాయింపు సందర్భంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిని బ్రాహ్మణ సంఘాలు ఘనంగా సత్కరించాయి.
కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్య కార్యదర్శి కృష్ణారావు, రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం, నందప్రసాద్, శైలజ, గిరిజ, సూర్యకుమారి, సుధా, భాస్కరరావు, రాజకుమార్, రమణాచారి, కిరణ్‌కుమార్, మాధవరావు, చంద్రమౌలి, సుధాకర్, ప్రభాకర్‌రావు, రాంబాబు, శేషాద్రి, నేతలు జగదీశ్‌గౌడ్, ఏకే మురుగేష్, బద్దం పరుశురాంరెడ్డి, జేఏసీ వెంకన్న, మేకల రాముయాదవ్, సంపత్ పాల్గొన్నారు.