హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ది జర్నలిస్ట్స్కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడిగా బ్రహ్మండభేరి గోపరాజు, కార్యదర్శిగా ఎం రవీంద్రబాబు ఎన్నికయ్యారు. మొత్తం 9 డైరెక్టర్స్ పోస్టుల కు గురువారం ఎన్నికలు నిర్వహించ గా, నాన్ అలాటీ ప్యానెల్ నుంచి ఆరుగురు అభ్యర్థులు గెలుపొందారు.
కోశాధికారిగా భీమగాని మహేశ్వర్గౌడ్, ఉ పాధ్యక్షుడిగా ఎం లక్ష్మీనారాయణ, స హాయ కార్యదర్శిగా సీహెచ్ భాగ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాన్ అ లాటీ సభ్యులకు ఇండ్ల స్థలాలు ఇప్పించడమే తమ మొదటి లక్ష్యమని గోపరాజు పేరొన్నారు. కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ సభ్యుడు డీ కమలాచార్య తదితరులు పాల్గొన్నారు.