శంషాబాద్ రూరల్,నవంబర్ 10: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్ నుంచి శంషాబాద్(హైదరాబాద్) ఎయిర్‌పోర్టుకు వస్తున్న బ్రిటిష్ ఎయిర్‌లైన్స్(బీఏ-277) విమానంలో 212 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబు పెట్టిన్నట్టు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఎయిర్‌పోర్టు అధికారిక వెబ్‌సైట్‌కు ఈ-మొయిల్ వచ్చింది. దీంతో సీఐఎస్ఎఫ్ అధికారులతోపాటు ఇతర సెక్యూరిటీ అధికారుల బృందం అప్రమత్తమై పైలట్‌కు సమాచారం ఇవ్వడంతో విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉదయం 5:30 నిమిషాలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు.
బాంబుస్కాడ్ బృందాలు ప్రయాణికులను తనిఖీ చేసి కిందకు దింపారు. బాంబులేదని నిర్ధారించారు. బెదిరింపుపై ఎయిర్ పోర్ట్ అధికారులు ఆర్జీఐఏ పోలీస్ అవుట్‌పోస్ట్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.