హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కేంద్రం అమల్లోకి తెచ్చిన మూడు కొత్త న్యాయ చట్టాలపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం పరిశీలించి టేబులార్ ఫార్మాట్లో తిరిగి సమర్పించాలని సూచించింది. కొత్త నేర, న్యాయచట్టాల్లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పిటిషన్లో బోయినపల్లి పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 కింద నిందితులకు ఉన్న ప్రాథమిక హకులకు భంగం కలిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఆర్టికల్ 348 ప్రకారం అధికార ఉత్తర, ప్రత్యుత్తరాలన్నీ ఇంగ్లిష్‌లో ఉండాలి. కానీ, కొత్తచట్టాల పేర్లను హిందీలో పెట్టారు. న్యాయ సంహిత, న్యాయ సురక్ష సంహిత, సాక్ష్య అధినియమ్ అర్థాలు ఆంగ్ల నిఘంటువుల్లో లేవని, క్షేత్రస్థాయిలో ఈ చట్టాలను అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే కాబట్టి వారి సూచనలు స్వీకరించి చట్టాల్లో ఉన్న లోపాలను సరిదిద్దాలని కోరారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్లు 15, 43(3), 94, 96, 107, 185, 187, 349, 479, 118, 152, భారతీయ సాక్ష్య అధినియమ్లోని సెక్షన్ 23 రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21, 348కి విరుద్ధంగా ఉన్నందున వాటిని కొట్టేయాలని వినోద్‌కుమార్ కోరారు.
నోట్ దిస్పాయింట్
సుప్రీంకోర్టు ధర్మాసనానికి బోయినపల్లి సమర్పించిన పిటిషన్‌లోని అంశాల్లో కొన్ని…