మహబూబాబాద్ : గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, గురువారం లింగ్యా నాయక్ చిత్ర పటానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంత్రి సత్యవతిని ఓదార్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు. జెడ్పీ చైర్మన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, నాగుర్ల వెంకన్న, మర్నేని వెంకన్న, మర్రి రంగారావు, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, రవిచంద్ర రెడ్డి, గోగుల రాజు, యాళ్ల మురళీధర్ రెడ్డి ఉన్నారు.