బేగంపేట్ జనవరి 28: హుస్సేన్‌సాగర్‌లో గల్లంతైన అజయ్ మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఈ నెల 26న భారతమాతకు మహాహారతిలో భాగంగా ట్యాంక్‌బండ్‌లో పటాకులతో ఉన్న పడవలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ పడవలో నుంచి గల్లంతైన అజయ్ రెండ్రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం గుర్తించారు.
ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి గణపతి యశోద దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.