Photography | మహబూబ్‌నగర్, మే 17 : ఫొటోగ్రఫీ పేరుతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న కెమెరామన్ లీలలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే.. ఎండీ ఎజాస్ అనే యువకుడు ఆరేండ్ల క్రితం బతుకుదెరువు కోసం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడకు వచ్చాడు. ఫిజా పేరుతో ఫొటో స్టూడియో నిర్వహిస్తూ, కోయిలకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. స్టూడియోకు వచ్చే అమాయక యువతులను టార్గెట్ చేసి ఫొటోషూట్.. ఇన్స్టాగ్రామ్ వీడియోల పేరుతో ఎరవేసి సీక్రెట్‌గా నీలిచిత్రాలు చిత్రీకరించాడు.
ఈ చిత్రాలతో సదరు యువతులను పలుమార్లు లైంగికంగా వేధించి, 20 మంది యువకులతో నీలిచిత్రాలు తీసినట్టు తెలిసింది. గురువారం ఓ యువతికి సంబంధించిన అశ్లీల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా సదరు యువతి బంధువులు, స్థానిక యువకులు అతడిపైదాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఫొటో స్టూడియోలో ఉన్న కంప్యూటర్, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.