సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 11: ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితికి చేరిన ఏడాది వయస్సు గల చిన్నారిని సకాలంలో దవాఖానకు తరలించి మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ బ్లూకోల్ట్స్ పోలీసులు ఔదార్యాన్ని చాటుకున్నారు. శ్రీరాంపూర్‌కు చెందిన బాబుకు బుధవారం తీవ్ర జ్వరం రావడంతో తల్లిదండ్రులు మంచిర్యాల దవాఖానకు తీసుకెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా, సీసీసీ కార్నర్ వద్దకు చేరుకోగానే బాబుకు ఫిట్స్ వచ్చింది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు బాబుకు ప్రథమ చికిత్స చేసి తమ బైక్‌పై సమీపంలోని దవాఖానకు తరలించారు. బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
కరెంటు సమస్యను పరిష్కరించాలంటూ విద్యుత్‌శాఖ కార్యాలయ తలుపులకు వినతిపత్రాన్ని అంటించిన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో బుధవారం చోటు చేసుకున్నది. కచ్వార్ గ్రామంలో తరచూ కరెంట్ సమస్య వేధిస్తుండడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు, రైతులు.. మక్తల్ సబ్‌స్టేషన్ వద్ద ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్ ఆపరేషన్ కార్యాలయానికి తరలివెళ్లగా ఏఈతో సహా సిబ్బంది లేకపోవడంతో తలుపునకు వినతిపత్రాన్ని అంటించి వెనుదిరిగారు.